రష్యాలో పర్యటించినందుకే ఇమ్రాన్ ఖాన్ పై అమెరికా కక్ష: రష్యా

  • ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనను రద్దు చేసుకోలేదు
  • దీంతో శిక్షించాలని అమెరికా నిర్ణయించుకుంది
  • రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రకటన
పాకిస్థాన్ విషయంలో అమెరికాపై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనను రద్దు చేసుకోలేదు. దాంతో ఇమ్రాన్ ఖాన్ ను శిక్షించాలని అమెరికా నిర్ణయించుకుంది’’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు. 

తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక ఓ విదేశీ హస్తం ఉందని ఇమ్రాన్ ఖాన్ లోగడ ఆరోపించారు. పరోక్షంగా ఈ నిందను అమెరికపై వేశారు. తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర చేసిందంటూ మండిపడ్డారు. తన స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల అభ్యంతరంతోనే అలా చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఇలా స్పందించడం గమనార్హం. 

ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఫిబ్రవరి 23న ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనకు వెళ్లారు. ‘‘భలే సమయంలో వచ్చాను. ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అంటూ ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలు వచ్చాయి.


More Telugu News