'రాధే శ్యామ్' అలా కొంతవరకూ ఆదుకుందట!

  • మార్చి 11న వచ్చిన 'రాధేశ్యామ్'
  • అంచనాలను అందుకోలేకపోయిన ప్రేమకథ
  • భారీ స్థాయిలో వచ్చిన నష్టాలు 
  • ఊరటనిచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వంశీ .. ప్రమోద్. ప్రసీద కలిసి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటలీ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. భారీ అంచనాల మధ్య దీనిని విడుదల చేశారు.

అయితే అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. భారీ మొత్తంలోనే నష్టాలు వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తన పారితోషికాన్ని వదులుకున్నాడనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో నెల రోజుల లోగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. దాంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లంతా ఇప్పుడు చూస్తున్నారు. 

'రాధేశ్యామ్' థియేట్రికల్ హక్కుల వలన నష్టపోయిన నిర్మాతలకు, డిజిటల్ హక్కుల వలన భారీ ఆదాయం చేకూరింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరి కొంతకాలం తరువాత ఈ సినిమా స్ట్రీమింగ్ కావాలి. కానీ ముందుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ వారు అదనంగా మరో 25 కోట్లను చెల్లించారట. ఒకరకంగా ఇది నిర్మాతలకు ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు.


More Telugu News