కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఫిఫ్టీలు.. సన్ రైజర్స్ టార్గెట్ 170 రన్స్
- ముంబయిలో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో
- మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 రన్స్
- రెండేసి వికెట్లు తీసిన సుందర్, షెపర్డ్, నటరాజన్
ముంబయిలో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ దీపక్ హుడా అర్ధసెంచరీలు నమోదు చేశారు.
ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా, వేగంగా ఆడిన దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 51 పరుగులు సాధించాడు. యువ బ్యాట్స్ మన్ ఆయుష్ బదోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు.
అంతకుముందు, ఓపెనర్ క్వింటన్ డికాక్ 1, ఎవిన్ లూయిస్ 1 పరుగుకే అవుటై నిరాశపరిచారు. మనీష్ పాండే 11, కృనాల్ పాండ్య 6, జాసన్ హోల్డర్ 8 (నాటౌట్) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.