హైదరాబాద్‌లోని అన్ని పబ్‌లూ మూసేయండి: కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్
- బర్త్ డే సందర్భంగా పబ్‌కు అంజన్ కుమారుడు
- మాజీ ఎంపీనే స్వయంగా వెల్లడించిన వైనం
- తన కొడుకు స్నేహితులతో కలిసి వెళ్లాడని వెల్లడి
- తప్పు లేకున్నా అభాండాలు వేస్తున్నారని ఆవేదన
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌లో డ్రగ్స్ వినియోగం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పబ్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలు ఈ కేసును మరింత కీలకంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని అన్ని పబ్‌లనూ మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంజారా హిల్స్ పబ్‌పై పోలీసులు జరిపిన దాడుల సందర్భంగా అంజన్ కుమారుడు కూడా అక్కడే ఉన్నారట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన అంజన్.. తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పబ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్తే అభాండాలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.