తెలంగాణ హైకోర్టుకు క్ష‌మాప‌ణ చెప్పిన‌ మాజీ ఐఏఎస్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి

  • సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాఖ్య‌లు
  • వెంక‌ట్రామిరెడ్డిపై కోర్టు ధిక్క‌ర‌ణ కేసు న‌మోదు
  • తాజా విచార‌ణ‌లో లిఖిత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ చెప్పిన ఐఏఎస్‌
  • కేసు విచార‌ణ‌ను ముగించిన హైకోర్టు
కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో తెలంగాణ కేడ‌ర్ మాజీ ఐఏఎస్ అధికారి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వెంక‌ట్రామిరెడ్డిపై కొన‌సాగుతున్న కోర్టు ధిక్క‌రణ కేసు విచార‌ణ‌ను ముగిస్తున్న‌ట్లు తెలంగాణ హైకోర్టు సోమ‌వారం ప్ర‌క‌టించింది.

సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో వెంక‌ట్రామిరెడ్డిపై కోర్టు ధిక్క‌ర‌ణ కేసు న‌మోదైంది. ఆ త‌ర్వాత ఈ కేసు విచార‌ణ సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగింది. ఇలాంటి త‌రుణంలో కోర్టుకు క్ష‌మాప‌ణ చెబుతూ వెంక‌ట్రామిరెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

ఈ మేర‌కు సోమ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న లిఖిత‌పూర్వ‌కంగా కోర్టుకు క్ష‌మాప‌ణ చెప్పారు. దీంతో ఈ కేసు ‌విచార‌ణ‌ను ముగిస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. ఐఏఎస్ సర్వీసుకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంకట్రామిరెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.


More Telugu News