డ్రగ్స్‌పై బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు.. రేవంత్, బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్
- డ్రగ్స్ అమ్మేది బీజేపీ నేతలే
- తనిఖీల్లో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లల పట్టివేత
- డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నామన్న సుమన్
హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంపై టీఆర్ఎస్ యువనేత, పెద్దపల్లి ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఓ బీజేపీ నేత కుమారుడు ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అమ్మేది బీజేపీ నేతలేనంటూ కూడా సుమన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమ పిల్లల పాత్రకు స్పందించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్...శనివారం నాటి పోలీసుల తనిఖీల్లో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే దొరికారని అన్నారు. ఇంకా కొంత మంది నేతల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోందన్న ఆయన.. భవిష్యత్తులో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ రివ్యూలు చేశారని, ఈ కారణంగానే డ్రగ్స్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.