ప్రొటోకాల్ వివాదం.. నంద్యాల జిల్లా క‌లెక్ట‌ర్‌పై ఎమ్మెల్యేల ఆగ్ర‌హం

  • నంద్యాల జిల్లా ప్రారంభోత్స‌వ ఫ‌ల‌కంపై ఇద్ద‌రి పేర్లే
  • క‌నిపించ‌ని మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు
  • ఆహ్వానం పంపి పేర్లెందుకు రాయించ‌లేద‌న్న ఎమ్మెల్యేలు
ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా నంద్యాల‌లో ప్రొటోకాల్ వివాదం చెల‌రేగింది. జిల్లా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కంపై ఆ జిల్లా ప‌రిధిలోని త‌మ‌ పేర్లు లేవంటూ వైసీపీ ఎమ్మెల్యేలు క‌లెక్ట‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

నంద్యాల జిల్లా ప‌రిధిలో నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిలో డోన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. శిలా ఫ‌ల‌కంపై ఆయ‌న పేరుతో పాటు, నంద్యాల స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా ర‌వికిశోర్ రెడ్డి పేర్లు మాత్ర‌మే ఉన్నాయి‌. 

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, నందికొట్కూరు, బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, అర్థ‌ర్‌, కాట‌సాని రామిరెడ్డిలు క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జిలానీని నిల‌దీశారు. జిల్లా ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం పంపిన త‌ర్వాత శిలాఫ‌ల‌కంపై త‌మ పేర్లు ఎందుకు చేర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు‌. ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా ప్ర‌శ్నించ‌డంతో క‌లెక్ట‌ర్ నీళ్లు న‌మిలారు.


More Telugu News