ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించండి.. ప్రధానికి రఘురామకృష్ణరాజు లేఖ
- కోర్టు తీర్పులపై అసెంబ్లీలో చర్చిస్తున్నారని ఫిర్యాదు
- ఏపీలో కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోయాయని వ్యాఖ్య
- న్యాయ వ్యవస్థపై అధికార పక్షం దాడి చేస్తోందన్న రఘురాజు
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన సదరు లేఖలో మోదీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
"హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుబట్టింది. కోర్టు తీర్పును తప్పుబడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయ వ్యవస్థపై అధికార పక్షం దాడికి ఇదే నిదర్శనం. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించాలి.
అమరావతి నిర్మాణానికి 60 నెలల సమయం కావాలన్నారు. 150 కేసులకు పైగా కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోర్టు ధిక్కరణ కేసులు కూడా అంతకుమించి పెరిగిపోయాయి. కోర్టు ధిక్కరణపై 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు శిక్ష విధించింది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. ఏపీలో రాష్ట్రపతి పాలనకు తక్షణమే కేంద్రం సిఫారసు చేయాలి" అని ఆయన ప్రధాని మోదీకి విన్నవించారు.