పెట్రో ధ‌ర‌ల పెంపుపై రాహుల్ గాంధీ వినూత్న ట్వీట్‌

  • పెట్రో ధ‌ర‌ల పెంపుపై రాహుల్ నిర‌స‌న‌
  • ట్విట్ట‌ర్ వేదికగా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌
  • ఆయా వాహ‌నాల ఇంధ‌నానికి అయ్యే ఖ‌ర్చు ప్ర‌స్తావ‌న‌
  • ప్ర‌ధాన మంత్రి జన్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ ఎద్దేవా
దేశంలో దాదాపుగా ప్ర‌తి రోజూ పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌పై విప‌క్షాలు నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రక‌మైన నిర‌స‌న‌ల‌ను చేప‌డుతున్నాయి. ఈ ఆందోళ‌న‌ల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆది నుంచి పాలుపంచుకుంటూనే ఉంది. అందులో భాగంగానే ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ కూడా మోదీ స‌ర్కారుపై ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీ సంధించిన ఓ పోస్టు జ‌నాన్ని అమితంగా ఆక‌ట్టుకుంటోంది. బైక్‌, కారు, ట్రాక్ట‌ర్‌, లారీ..ఇలా ప‌లు వాహ‌నాల ఇంధ‌న ట్యాంక్‌ను ఫుల్ చేసుకోవాలంటే గ‌తంలో అయ్యే ఖ‌ర్చుకు ఇప్పుడు దాదాపుగా రెట్టింపు ఖ‌ర్చు అవుతోంద‌న్న వాద‌న‌ను వినిపించిన రాహుల్‌..ఆయా వాహ‌నాల ట్యాంకుల‌ను ఫుల్ చేసుకునేందుకు గ‌తంలో వెచ్చించిన మొత్తం..ఇప్పుడు వెచ్చించాల్సి వ‌స్తున్న మొత్తాల‌తో కూడిన అంకెల‌తో ట్వీట్ ను సంధించారు. అంతేకాకుండా ఈ ట్వీట్ కు ఆయ‌న ప్ర‌ధాన మంత్రి జన్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ ఓ పేరు కూడా పెట్టేశారు.


More Telugu News