అదిరిపోయే ఫీచర్లతో వివో ఎక్స్ 80
- ఈ నెల చివర్లో చైనాలో ఆవిష్కరణ
- ఆ తర్వాత భారత్ మార్కెట్ కు
- పంచ్ హోల్ డిజైన్ తో డిస్ ప్లే
- మొత్తం రెండు వేరియంట్లు
వివో ఎక్స్70 సిరీస్ కు కొనసాగింపుగా ఎక్స్80 సిరీస్ ఫోన్లను వివో సంస్థ ఈ నెల చివర్లో విడుదల చేయనుంది. ఆ తర్వాత కొన్ని వారాలకే అవి భారత్ మార్కెట్ కు రానున్నాయి. ఎక్స్70 సిరీస్ ఫోన్లు కూడా తొలుత చైనాలో విడుదల అయిన కొన్ని వారాలకే భారత్ మార్కెట్ కు రావడం గమనార్హం. వివో ఎక్స్80 సిరీస్ ఫోన్ల ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ, చైనాకు చెందిన డిజిటల్ చాట్ స్టేషన్ వీటి వివరాలను బయటపెట్టింది.
వివో ఎక్స్ 80, ఎక్స్ 80 ప్రో అనే రెండు వేరియంట్లు రానున్నాయని తెలుస్తోంది. వివో ఎక్స్ 80లో 6.78 అంగుళాల ఈ5 అమోలెడ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ ప్లే డిజైన్ తో ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో రానుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రోలోనూ ఇదే చిప్ సెట్ ను వాడారు.
వివో ఎక్స్ 80 ప్రోలో హాప్టిక్ ఫీడ్ బ్యాక్ మరింత మెరుగ్గా ఉండేందుకు ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ ను వాడారు. వేడిని బయటకు పంపించేందుకు 4,000 ఎంఎం స్క్వేర్ చాంబర్ ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా (వెనుక భాగంలో) సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్ 5 సెన్సార్, 13 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 663 సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీల కోసం 44 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఎక్స్80లో ఉండే డిస్ ప్లేనే ఎక్స్ 80ప్రోలో ఉంటుంది. కాకపోతే ప్రో వెర్షన్ లో క్యూహెచ్ డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.