శ్రీ‌ సత్యసాయి జిల్లా ఏర్పాటుపై అభ్యంత‌రాలు.. బాల‌కృష్ణ‌, గోరంట్ల మాధ‌వ్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు

  • హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో అఖిలపక్షం నిర‌స‌న‌
  • బాల‌కృష్ణ‌ను విమ‌ర్శించిన‌ బీసీ సంక్షేమ సంఘం నేత చలపతి
  • చ‌లప‌తి తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగ్ర‌హం
  • అఖిలపక్ష నేతల మ‌ధ్య‌ వాగ్వివాదం.. తోపులాట
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు అమల్లోకి రావ‌డం, కొత్తగా జిల్లాల్లో భాగంగా.. శ్రీ‌ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయ‌డం వంటి ప‌నులు పూర్తయిన విష‌యం తెలిసిందే. అయితే, కొత్త జిల్లాల విష‌యంలో ఇప్ప‌టికీ ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో అఖిలపక్షం నిర‌స‌న‌ల‌కు దిగింది. 

ఏపీ ప్ర‌భుత్వంతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ అహ్మద్ ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారు ముగ్గురూ మూర్ఖులు అంటూ బీసీ సంక్షేమ సంఘం నేత చలపతి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నిర‌స‌న‌లో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు చ‌లప‌తి తీరుపై అభ్యంతరాలు వ్య‌క్తం చేశారు. దీంతో అఖిలపక్ష నేతల మ‌ధ్య‌ వాగ్వివాదం జ‌రిగి, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ప‌రిస్థితుల‌ను అదుపుచేసేందుకు ప్ర‌యత్నిస్తున్నారు.


More Telugu News