తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 'ఆచార్య' రిలీజ్!

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 'ఆచార్య' రిలీజ్!
  • 'ఆచార్య'గా చిరంజీవి 
  • చరణ్ జోడీగా పూజ హెగ్డే 
  • రెజీనా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణ
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
చిరంజీవి -  చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆచార్య' సినిమా రూపొందింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ .. చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. 

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారట. 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో ఈ  సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

'సైరా' తరువాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడం .. చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను ధరించడం .. ఒకే ఆశయం కోసం కలిసి పోరాడటం ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా చేస్తున్నాయి. సోనూసూద్ .. సంగీత .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


More Telugu News