కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకపోవడం సరికాదు: విష్ణువర్ధన్ రెడ్డి
- కొత్త జిల్లాలు ప్రారంభించినందుకు ఏపీ ప్రభుత్వానికి అభినందనలు
- ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చు
- ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చని చెప్పారు.
అయితే, ప్రారంభోత్సవాలకు ప్రతిపక్ష పార్టీలను వైసీపీ సర్కారు ఆహ్వానించకపోవడం సరికాదని ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, ఇది రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ ఏకం కావాల్సిన అంశమని చెప్పారు. అప్పుడే దాన్ని ప్రజా పరిపాలన అని అంటారని ఆయన అన్నారు.