ప్లాస్టిక్ కవర్‌లో శిశువును ఉంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద వదిలివెళ్లిన వైనం
- అంగవైకల్యం ఉన్న శిశువు
- కొందరు ఆటోలో వచ్చి వదిలివెళ్లినట్లు గుర్తింపు
- శిశువును ఆసుపత్రిలో చేర్చిన నీలోఫర్ సిబ్బంది
అంగవైకల్యం ఉన్న శిశువుకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఆ శిశువును పెంచలేక వదిలించుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. చివరకు ఓ ప్లాస్టిక్ సంచిలో ఆ శిశువును ఉంచి ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. అక్కడ ప్లాస్టిక్ కవర్ లో పసికందు ఉన్నట్లు గుర్తించిన కొందరు ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.
శిశువు ఉన్న కవర్‌ను కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి ఆసుపత్రి వద్ద పెట్టి వెళ్లిపోయారని చెప్పారు. శిశువును ఆసుపత్రిలో చేర్చిన నీలోఫర్ సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువుకు అంగవైకల్యం, జాండిస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం అందించారు.