క‌ర్ణాట‌క‌లోని అంజనాద్రి కొండే హనుమంతుని జన్మస్థలం: బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య

  • కొంద‌రు ప‌లు ర‌కాల‌ వాదనలు చేసినా ఫ‌ర్వాలేదు
  •  కిష్కింద హనుమంతుడి జన్మస్థలం
  •  ఇందులో ఎలాంటి అనుమానాలూ లేవన్న తేజస్వి 
హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల వివాదంపై బీజేపీ నేత‌, క‌ర్ణాట‌క‌ ఎంపీ తేజ‌స్వి సూర్య ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. త‌మ రాష్ట్రంలోని అనెగొండి సమీపంలోని అంజనాద్రి కొండే హనుమంతుని జన్మస్థలం అని చెప్పారు. 

దీనిపై కొంద‌రు ప‌లు ర‌కాల‌ వాదనలు చేసినా ఫ‌ర్వాలేదని ఆయ‌న అన్నారు. కిష్కింద హనుమంతుడి జన్మస్థలమ‌ని, ఇందులో ఎలాంటి అనుమానాలూ లేవ‌ని చెప్పారు. అంజనాద్రి కొండ సమగ్ర అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని ఆయ‌న వివ‌రించారు. 

మరోపక్క, ఏపీలోని తిరుమలలోనూ అంజనాద్రి కొండ ఉన్నట్లు కనుగొన్నారని ఆయ‌న అన్నారు. దేశ ప్ర‌జ‌లు సంప్రదాయాలను నమ్ముతార‌ని, వీటిని విస్మరించలేమ‌ని అన్నారు. కాగా, తిరుమలలోని అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


More Telugu News