అసలు కుట్రదారు ఇమ్రాన్ ఖానే: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- పాక్ లో జాతీయ అసెంబ్లీ రద్దు
- ప్రధాని ఇమ్రాన్ సిఫారసుతో దేశాధ్యక్షుడి నిర్ణయం
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్న నవాజ్ షరీఫ్
- ఇమ్రాన్, తదితరులను విచారించాలని డిమాండ్
పాకిస్థాన్ విపక్ష నేతలు అమెరికాతో జట్టుకట్టి తనను గద్దె దించడానికి కుట్రలకు పాల్పడుతున్నారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తుండగా, అసలు కుట్రదారుడు ఇమ్రాన్ ఖానే అని మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ధ్వజమెత్తారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసుతో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం నవాజ్ షరీఫ్ స్పందించారు.
ప్రధాని ఇమ్రాన్, ఇతరులు దేశానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడ్డారని, వారు అత్యంత దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారని, వారిని రాజ్యాంగంలోని ఆర్టికల్-6 ప్రకారం తప్పకుండా విచారించాల్సిందేనని తెలిపారు. "అధికారం కోసం పాకులాడిన ఓ వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు" అంటూ నవాజ్ షరీఫ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నవాజ్ షరీఫ్ లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.