ఐపీఎల్: చెన్నై ముందు భారీ లక్ష్యం ఉంచిన పంజాబ్ కింగ్స్
- ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ పంజాబ్
- టాస్ గెలిచిన చెన్నై
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
- నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 రన్స్
- 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 24 బంతుల్లో 33, జితేశ్ శర్మ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 3 సిక్సులు బాదాడు.
చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, ప్రిటోరియస్ 2 వికెట్లు తీయగా, ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు.
చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, ప్రిటోరియస్ 2 వికెట్లు తీయగా, ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు.