గని సినిమాను నేను చూశాను... చాలా బాగుంది: అల్లు అర్జున్
- వైజాగ్ లో గని ప్రీరిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
- వరుణ్ తేజ్ పై ప్రశంసలు
- సినిమాలో అందరూ బాగా చేశారని కితాబు
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'గని'. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కానుండగా, వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, వైజాగ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా తన చిత్రాలన్నీ ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయని వెల్లడించారు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఏదో ఒక మాధుర్యం ఉంటుందని తెలిపారు.
గని చిత్రంతో తన సోదరుడు అల్లు బాబీ నిర్మాతగా సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. తన జీవితంలో సోదరుడు అల్లు బాబీ పాత్ర ఎంతో ఉందని, తండ్రి తర్వాత అంతటివాడైన అన్నయ్య నిర్మాతగా మారడాన్ని తాను ఎంతో మద్దతుగా భావిస్తున్నట్టు వివరించాడు.
నిర్మాత సిద్ధు ముద్దా గురించి మాట్లాడుతూ, "సిద్ధూకి మా కజిన్ సిస్టర్ ను ఇచ్చాం. అమెరికాలో అనేక కష్టాలు పడి వచ్చి నిర్మాత అయ్యాడు. ఈ సినిమాతో విజయం అందుకుంటాడని నమ్ముతున్నాను. ఇక వరుణ్ గురించి చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే చాలా ఇష్టం. ఎంతో క్యూట్ గా ఉండేవాడు. ఇప్పుడు కాదు... వరుణ్ పుట్టినప్పటి నుంచే అందగాడు. ఇప్పుడు వరుణ్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఎందుకంటే, తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ట్రెండ్ ను ఫాలో కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపిస్తుంటాడు.
హిట్లు కొట్టి కూడా కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలన్న రిస్క్ తీసుకోవడం అభినందనీయం. అన్ని సినిమాలన్నీ ఒకెత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు. వరుణ్ గని కోసం చాలా కష్టపడ్డాడు. నీ కసి, నీ హార్డ్ వర్క్ కు ఫలితం ఇచ్చేలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను చూశాను. ఎంతో బావుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా బాగా చేసింది.
మా బ్రదర్ తమన్ సంగీతం గురించి చెప్పాలి. ఈ మధ్య తమన్ ముట్టుకుందంతా బంగారం అవుతోంది. భీమ్లా నాయక్, అఖండ, డీజే టిల్లు... ఇలా ఏది పట్టుకున్న బంగారమే. గని దర్శకుడు కిరణ్ కు తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశాడు. కొత్తవాడు అయినా కిరణ్ ను అందరూ నమ్మారు. వాళ్లందరి నమ్మకాన్ని కిరణ్ నిలబెట్టుకున్నాడు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ అభిమానులకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మొదటి నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న మెగా ఫ్యాన్స్ కు అభినందనలు. చివరగా నా ఆర్మీ గురించి చెప్పాలి. నేను నా అభిమాన సైన్యాన్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు... మీరు చేస్తున్న మంచి పనులతో నాకు కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలనిపిస్తోంది" అని వివరించారు.
అంతకుముందు, హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, అందరూ ఉగాది పండుగను ఇంట్లో వాళ్లతో జరుపుకుంటారని, ఇవాళ తాను తన తల్లిదండ్రులను కలవడం కూడా కుదరలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బన్నీ అన్నకు, మామ అల్లు అరవింద్ కు, దర్శకుడు హరీశ్ శంకర్ కు, బన్నీ అభిమానులకు, మెగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఇవాళ అందరిముందుకు వచ్చి గని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు కిరణ్ గత ఐదేళ్లుగా తనకు తెలుసని, ఈ సినిమాకు అతడ్ని దర్శకుడిగా ఎంపిక చేసుకుని సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో నేను ప్రాణం పెట్టి చేశానని, నా కంటే దర్శకుడు కిరణ్, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలు ఎంతో తపన చూపించారని కొనియాడారు.
ఇక, పవన్ కల్యాణ్ బాబాయి నటించిన తమ్ముడు చిత్రం తనకు చాలా ఇష్టమని, చిన్నప్పుడు ఎన్నోసార్లు చూశానని తెలిపారు. తమ్ముడు చిత్రం స్ఫూర్తితోనే తాను, దర్శకుడు కిరణ్ ఎంతో చర్చించుకుని ఈ సినిమా చేశామని వెల్లడించారు. తాను ఈ ఫంక్షన్ కు వస్తుంటే దార్లో చిరంజీవి గారు ఫోన్ చేశారని తెలిపారు. ఫంక్షన్ కు బన్నీ వస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడని వివరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్పాలని, ఈ సినిమాలో తన లుక్ కు అవసరమైన వర్క్ కోసం ఓ ట్రైనర్ ను రామ్ చరణ్ పంపించాడని తెలిపారు.