ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడంలేదు: మురళీమోహన్

  • ఏడేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదన్న మురళీమోహన్
  • కార్యక్రమాన్ని పక్కనబెట్టారని ఆవేదన
  • అవార్డులు ప్రాణవాయువు వంటివని వ్యాఖ్య  
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు నంది అవార్డుల కార్యక్రమాన్ని పక్కనబెట్టాయని అన్నారు. 

కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రం సినీ కళాకారులకు అవార్డులు ఇస్తున్నాయని మురళీమోహన్ పేర్కొన్నారు. సినీ కళాకారులకు నంది అవార్డులు ప్రాణవాయువు వంటివని ఆయన అభివర్ణించారు. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News