కనిపించిన నెలవంక... రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

  • ముస్లింలకు పరమ పవిత్రం రంజాన్ మాసం
  • నెలవంక కనిపించడంతో మోగిన సైరన్లు
  • ఇప్పటికే మసీదుల్లో అందమైన అలంకరణలు
  • నేటి నుంచి తారవి నమాజులు
ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి షురూ కానుంది. నేటి (శనివారం) సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు.  నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో నేటి నుంచి తారవి నమాజులు చేపట్టనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు రేపు (ఆదివారం) ప్రారంభం కానున్నాయి. రంజాన్ నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News