రాములోరి కల్యాణానికి కేసీఆర్‌కు ఆహ్వానం
- 10,11న భద్రాద్రి రాములోరి కల్యాణం
- ఈ దఫా భక్తుల సమక్షంలోనే వేడుక
- కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరు కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 10, 11న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు హాజరు కావాలని ఆలయం తరఫున తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా భక్తులు లేకుండానే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా విస్తృతి బాగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది ఈ వేడుకకు భక్తులను అనుమతించాలని నిర్ణయించిన ఆలయం.. ఇప్పటికే టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.