ఉగాది రోజున ప్రారంభించే ఏ కార్యక్రమమైనా దిగ్విజయం అవుతుందని నానుడి: బాలకృష్ణ
- శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య
- బసవతారకం ఆసుపత్రి కోసం కొత్త సాఫ్ట్ వేర్
- గీతం వర్సిటీ సాయంతో రూపకల్పన
- బసవతారకం ఆసుపత్రిలో నేటి నుంచి కొత్త సాఫ్ట్ వేర్
ఉగాది సందర్భంగా నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. చైత్రమాసం పాఢ్యమి రోజున మనం తెలుగు సంవత్సరం తొలిరోజుగా ఉగాదిని జరుపుకుంటామని, సృష్టి ఆరంభానికి ఇదే తొలిరోజుగా భావిస్తారని వివరించారు. శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఉగాది రోజున ప్రారంభించే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా కొనసాగుతుందనేది నానుడని అని వెల్లడించారు. ఈ ఉగాది నాడు, గీతం యూనివర్సిటీ సహకారంతో రూపొందించిన కొత్త హాస్పిటల్ మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్ 'బసవతారకం హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్' (బీహెచ్ఐఎమ్)ను ప్రారంభించామని తెలిపారు. అందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
గత కొన్నినెలలుగా గీతం యూనివర్సిటీ ఐటీ ఇంజినీర్లు ఎంతో కష్టపడి, అందరి సహాయ సహకారాలతో ఈ సాఫ్ట్ వేర్ ను రూపొందించారని తెలిపారు. వారందరికీ తన అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ నూతన సాఫ్ట్ వేర్ సాయంతో ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందని బాలయ్య వివరించారు. భవిష్యత్ లో తమ ఆసుపత్రి కాగిత రహిత ఆసుపత్రిగా అవతరిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.