కౌలు రైతులకు జనసేన అండ.. ఉగాది వేళ కీలక ప్రకటన చేసిన పవన్
- ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి లక్ష సాయం
- వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య
- వైసీపీ హయాంలో కౌలు రైతులకు మరిన్ని ఇబ్బందులన్న పవన్
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతులకు అండగా నిలిచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగులో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సందర్బంగా ఈ దిశగా పవన్ కీలక ప్రకటన చేశారు.
ఏపీలో సాగు చేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పిన పవన్ కల్యాణ్.. సాగులో కౌలు రైతులకు ఎదురవుతున్న కష్టాల గురించి ప్రభుత్వ దృష్టి సారించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు పండించే ధాన్యాన్ని రూ.700లకు కొంటున్న మిల్లర్లు అదే ధాన్యాన్ని రూ.1,400లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల పరిస్థితి మరింతగా దిగజారిందని కూడా పవన్ ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3 వేల మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్ చెప్పారు. రాష్ట్రంలో 16 లక్షలకుపైగా కౌలు రైతులున్నారని, అయితే వారి సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆయన ద్వజమెత్తారు. జనసేన తరఫున ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.