ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు

  • ప్రగ‌తి భ‌వ‌న్‌లో తెలంగాణ ఉగాది అధికారిక వేడుక‌లు
  • సీఎం, స్పీక‌ర్‌, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజ‌రు
  • పంచాంగ శ్ర‌వ‌ణం వినిపించిన బాచంపల్లి
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుక‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అధికారిక వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల‌కు సీఎం కేసీఆర్‌తో పాటు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేత‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. 

ఇక ఈ వేడుక‌ల్లో ఉగాది ఆస్థానాన్ని బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి నిర్వ‌హించారు. ఉగాది సంద‌ర్భంగా పంచాంగ శ్ర‌వ‌ణాన్ని వినిపించిన శాస్త్రి.. శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వానికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని చెప్పారు. మ‌హిళ‌లకు మ‌రింత ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News