టీ20 రికార్డుకు.. 64 పరుగుల దూరంలో రోహిత్ శర్మ
- టీ20 ఫార్మాట్లో రోహిత్ 9,936 పరుగులు
- నేటి మ్యాచ్ లో 64 స్కోరు చేస్తే రికార్డు నమోదైనట్టే
- భారత్ నుంచి కోహ్లీ ఒక్కడి పేరిటే ఈ రికార్డు
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యాడు. మరో 64 పరుగులు సాధిస్తే అతడు 10,000 పరుగుల క్లబ్ లోకి చేరిపోతాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్క విరాట్ కోహ్లీకే ఇధి సాధ్యమైంది. అంతర్జాతీయంగా చూస్తే కోహ్లీ సహా ఆరుగురు టీ20 క్రికెట్లో 10,000 పరుగుల మైలు రాయిని అధిగమించారు.
క్రిస్ గేల్ 463 టీ20 మ్యాచ్ లు ఆడగా 14,562 పరుగులు సాధించాడు. షోయబ్ మాలిక్ 472 మ్యాచ్ లు ఆడి 11,698 పరుగులు.. కిరోన్ పోలార్డ్ 582 మ్యాచ్ లు ఆడి 11,430 పరుగులు సాధించారు. అరోన్ ఫించ్ 347 మ్యాచుల్లో 10,444 పరుగులు.. విరాట్ కోహ్లీ 328 మ్యాచుల్లో 10,326 పరుగులు నమోదు చేశారు. డేవిడ్ వార్నర్ 10,308 పరుగులతో జాబితాలో వీరి తర్వాత ఉన్నాడు. రోహిత్ శర్మ 371 మ్యాచులతో 9,936 పరుగులు సాధించాడు.
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ లు కలిపి ఈ రికార్డులు నమోదయ్యాయి. నేడు రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. రోహిత్ శర్మ బ్యాట్ తో కనీసం 64 పరుగులు అయినా తన ఖాతాలో వేసుకుంటే 10,000 క్లబ్ లోకి అడుగు పెట్టిన ఏడో క్రికెటర్ గా రికార్డు నమోదవుతుంది. రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా, ఐపీఎల్ లో మూడో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఇప్పటికే రికార్డులకు ఎక్కాడు.