హైదరాబాద్లో రూ. 116 దాటేసిన పెట్రోలు ధర.. నేడు కూడా బాదేసిన చమురు సంస్థలు
- గత పది రోజులుగా పెంచుకుంటూ పోతున్న చమురు సంస్థలు
- నిన్న ఒక్క రోజు ధరల పెంపునకు విరామం
- పెట్రోలుపై 90, డీజిల్పై 87 పైసల పెంపు
చమురు సంస్థల బాదుడు కొనసాగుతోంది. గత పది రోజులుగా ప్రతి రోజూ ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్న సంస్థలు నిన్న ఒక్కరోజు కాసింత విరామం ఇచ్చాయి. మళ్లీ ఈ రోజు నుంచి పెంపు మొదలెట్టాయి. లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి.
ఫలితంగా హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 116.32కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 102.45కు పెరిగింది. ఢిల్లీలో ఈ ధరలు వరుసగా రూ. 102.61, డీజిల్ రూ. 93.87గా ఉన్నాయి. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.117.57, డీజిల్ ధర రూ. 101.79కి చేరుకున్నాయి.