హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తిలోకి మేఘా గ్రూప్‌.. రూ.300 కోట్ల పెట్టుబ‌డితో స్టార్ట‌ప్‌

  • భవిష్య‌త్తు ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నం హైడ్రోజ‌న్‌
  • డ్రిల్ మెక్ పేరిట స‌బ్సిడ‌రీని ఏర్పాటు చేసిన మేఘా 
  • హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన పైరోలిటిక్ క‌న్వ‌ర్గ‌ర్ త‌యారీ
  • పైరోలిసిస్ ప్ర‌క్రియ ద్వారా హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తి
  • హైడ్రోజ‌న్‌తో పాటు జియో థ‌ర్మ‌ల్ ఎనర్జీనీ ఉత్ప‌త్తి చేయ‌నున్న వైనం
తెలుగు నేల‌కు చెందిన ప్ర‌ముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్‌) తాజాగా హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తి రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్ప‌టికే రూ.300 కోట్ల పెట్టుబ‌డితో డ్రిల్ మెక్ పేరిట మేఘా గ్రూప్ ఓ స్టార్ట‌ప్ కంపెనీని కూడా ప్రారంభించేసింది. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి వినియోగించే అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన పైరోలిటిక్ క‌న్వ‌ర్ట‌ర్‌ తయారీ ఇప్ప‌టికే పూర్తి అయిపోయింది. 

భ‌విష్య‌త్తు ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నంగా హైడ్రోజ‌న్‌కు గుర్తింపు ఉంది. హైడ్రోజ‌న్‌తో న‌డిచే కారులోనే ఇటీవ‌ల కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పార్ల‌మెంటు స‌మావేశాలకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా అందుబాటులోకి వ‌స్తున్న వాటిని అందిపుచ్చుకునే విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉండే మేఘా గ్రూప్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తి రంగంలోకి దిగిపోయింది. 

ఎలాంటి కాలుష్య కార‌కాలు వినియోగించ‌కుండా పైరాలిసిస్ ప్ర‌క్రియ ద్వారా డ్రిల్ మెక్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తిని చేయ‌నుంద‌ని తెలుస్తోంది‌. ఇప్ప‌టికే ఆ కంపెనీ రూపొందించిన పైరోలిటిక్ క‌న్వ‌ర్ట‌ర్‌తో హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తితో పాటు పంపిణీ కూడా సుల‌భ‌త‌రం కానుంది‌. మేఘా గ్రూప్ ఎంచుకున్న పైరాలిసిస్ ప్ర‌క్రియ‌లో హైడ్రోజ‌న్‌తో పాటు జియో థ‌ర్మ‌ల్ ఎన‌ర్జీని కూడా డ్రిల్ మెక్ ఉత్ప‌త్తి చేయ‌నుంద‌ట‌.


More Telugu News