ఏపీ ఉద్యోగులకు అందని వేతనాలు.. కారణమేంటంటే..!
- సీఎఫ్ఎంఎస్ స్థానంలో హెచ్ఆర్ఎంఎస్ విధానం
- పేరోల్ సెర్బ్ పేరిట కొత్త సాఫ్ట్‌వేర్ తెచ్చిన ప్రభుత్వం
- ఆర్బీఐకి ఇంకా అనుసంధానం కాని సాఫ్ట్‌వేర్
- కొనసాగుతున్న బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ
- ఈనెల 6,7 తేదీల్లో వేతనాలు విడుదలయ్యే అవకాశం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు జీతాలు పడలేదు. ఇందుకు ప్రభుత్వం నిధులు లేకపోవడం కారణం కాదని, ఓ కొత్త సమస్య వల్లే పడలేదనీ, ఈ నెల వేతనాలు 6, 7 తేదీల్లో ఉద్యోగులకు అందవచ్చనీ తెలుస్తోంది.
కొత్తగా తలెత్తిన ఇబ్బంది ఏమిటన్న విషయానికి వస్తే.. టీడీపీ హయాంలో సీఎఫ్ఎంఎస్ పేరిట కొత్తగా తీసుకువచ్చిన విధానం ద్వారా వేతనాలు చెల్లించే వారు. అయితే ఇప్పుడు వైసీపీ సర్కారు ఆ సాఫ్ట్ వేర్‌ను మార్చేసి.. టీడీపీ హయాం కంటే ముందు ఉన్న హెచ్ఆర్ఎంఎస్ విధానం ద్వారానే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిందట.
ఇందుకోసం పేరోల్ హెర్బ్ పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ సాఫ్ట్‌వేర్ ఇంకా ఆర్బీఐతో అనుసంధానం కాలేదు. అంతేకాకుండా పాత విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా పూర్తి కాలేదట. హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొనసాగుతోందని, అది పూర్తయ్యే సరికి ఈ నెల 5వ తేదీ రానుందని సమాచారం. ఈ లెక్కన ఈ నెల 6న గానీ, 7వ తేదీన గానీ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.