రికార్డు టర్నోవర్ సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్!
- 2020-21లో రూ.17,956 కోట్ల టర్నోవర్
- 2021-22లో రూ.28,008 కోట్ల టర్నోవర్
- ఏడాదిలోనే టర్నోవర్‌లో 56 శాతం వృద్ధి
విశాఖ స్టీల్ ప్లాంట్ గురువారంతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి టర్నోవర్‌ను సాధించింది. ఓ వైపు కరోనా, మరో వైపు బొగ్గు కొరత వేధిస్తున్నా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,008 కోట్ల టర్నోవర్‌ను సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) తన ప్రస్థానంలోనే అత్యధిక టర్నోవర్‌ను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే.. ఈ టర్నోవర్ ఏకంగా 56 శాతం అధికమని స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ చెప్పారు.
అంతకుముందు ఏడాదిలో కేవలం రూ.17,956 కోట్ల టర్నోవర్‌ను సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్.. గతేడాది మాత్రం ఉత్పత్తిలో స్పీడును పెంచేసి రికార్డు టర్నోవర్‌ను సాధించింది. గతేడాదిలో 5.773 మిలియన్ టన్నుల హాట్ మెటల్‌ను ఉత్పత్తి చేసిన స్టీల్ ప్లాంట్.. 5.272 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఇక సేలబుల్ స్టీల్ విషయానికి వస్తే.. 5.138 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిన విశాఖ స్టీల్ టర్నోవర్‌ను రికార్డు స్థాయికి పెంచుకుంది.