'దొంగ' తెలివితేటలు... ఆశ్చర్యపోయిన రాచకొండ పోలీసులు

  • ఘరానాదొంగ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.1.30 కోట్ల విలువైన ఆభరణాల స్వాధీనం
  • గత పదేళ్లుగా చోరీలు చేస్తున్న రాజు
  • రాజు అసలు పేరు ముచ్చు అంబేద్కర్
అతడి పేరు ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు. పోలీసులు ఎంతో కాలంగా వెదుకుతున్న గజదొంగ. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాజు మోస్ట్ వాంటెడ్ దొంగ. తాజాగా, రాచకొండ పోలీసులు ఘరానా దొంగ రాజును అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.30 కోట్ల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి చోరీలకు పాల్పడుతున్న రాజు ఆ నగలను ఎక్కడా అమ్మకుండా తనవద్దే ఉంచుకున్నాడు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హైదరాబాదులో రాజు ఉండేది ఫుట్ పాత్ పైనే. కానీ సొంతూర్లో మాత్రం అతడు సంపన్నుడు. స్వగ్రామంలో మూడంతస్తుల మేడ కట్టాడట. ఇక, పోలీసుల ప్రాథమిక విచారణలో రాజు వర్కింగ్ స్టయిల్ వెల్లడైంది. అది విని పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. 

రాజు ఎలా పడితే అలా దొంగతనానికి వెళ్లడు. అతడికి వచ్చే కలల ఆధారంగానే చోరీలకు పాల్పడతాడు. తాను ఎక్కడ దొంగతనం చేయాలో ఆ ఇల్లు కలలో వస్తుందని, కలలో కనిపించిన ఇంట్లోనే పనితనం ప్రదర్శిస్తానని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు, దొంగతనానికి వెళ్లాలో, వద్దో అనే విషయాన్ని చిట్టీల ద్వారా తేల్చేస్తాడు. రెండు చిట్టీలను వేసి ఒకదాన్ని తీస్తాడు. అందులో ఏం రాసి ఉంటే దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాడు.
.


More Telugu News