క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌!.. 50 శాతానికి పెరిగిన‌ ఆక్యుపెన్సీ!

  • మ‌హారాష్ట్రలో రేప‌టి నుంచి క‌రోనా ఆంక్ష‌ల‌కు చెల్లుచీటి
  • ఐపీఎల్ తాజా సీజ‌న్ మ్యాచ్‌ల‌న్నీ మ‌హారాష్ట్రలోనే
  • 25 శాతం ఆక్యుపెన్సీని 50 శాతానికి పెంచిన బీసీసీఐ
  • ఏప్రిల్ 6 నుంచి జ‌రిగే మ్యాచ్‌ల‌కు కొత్త నిబంధ‌న వ‌ర్తింపు
  • బుక్ మై షో ప్రక‌ట‌న‌
బీసీసీఐ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం క్రికెట్ ల‌వ‌ర్స్‌కు నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. క‌రోనా నేప‌థ్యంలో క్రికెట్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నా.. స్టేడియంల‌లోకి జ‌నాన్ని పూర్తిగా అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిందే క‌దా. ప్రస్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్‌లోనూ స్టేడియంల‌లో 25 శాతం ఆక్యుపెన్సీకి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అయితే తాజాగా ఆ 25 శాతం ఆక్యుపెన్సీని బీసీసీఐ 50 శాతానికి పెంచుతూ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఏప్రిల్ 2 నుంచి మ‌హారాష్ట్రలో క‌రోనా ఆంక్ష‌ల‌ను పూర్తిగా స‌డ‌లిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు నెల‌ల పాటు సాగ‌నున్న ఐపీఎల్‌కు చెందిన అన్ని మ్యాచ్‌లూ మ‌హారాష్ట్రలోనే జ‌రుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్న బీసీసీఐ.. మ్యాచ్‌లు జ‌రిగే స్టేడియాల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ మేర‌కు ఏప్రిల్ 6 నుంచి జ‌రిగే అన్ని మ్యాచ్‌ల‌కు 50 శాతం ఆక్కుపెన్సీ ఉంటుంద‌ని, టికెట్ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు బుక్ మై షో శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.


More Telugu News