ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు.. విద్యుత్ చార్జీల‌ పెంపుపై టీడీపీ వినూత్న నిర‌స‌న‌

  • ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై భగ్గుమంటున్న టీడీపీ  
  • రేప‌టి నుంచి వారం పాటు టీడీపీ నిర‌స‌న‌లు
  • చార్జీల పెంపుతో పాటు విద్యుత్ కోత‌ల‌పైనా మండిపాటు
ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వినూత్న నిర‌స‌న‌ల‌కు దిగుతోంది. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ లాంత‌రు చేత‌బ‌ట్టుకుని టీడీపీ కార్యాల‌యానికి చేరుకోగా.. ఇప్పుడు ఆ పార్టీ స‌రికొత్త నిర‌స‌న‌కు తెర తీసింది. విద్యుత్ చార్జీల‌పై రేప‌టి నుంచి వారం పాటు నాన్ స్టాప్‌గా ఆందోళ‌న‌లు కొన‌సాగించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది.

ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా ఇంటింటికీ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. పెంచిన విద్యుత్ చార్జీల వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై పెను భారం ప‌డ‌నుంద‌ని ఆరోపిస్తున్న టీడీపీ.. పెరుగుతున్న విద్యుత్ కోత‌లు మరింత ఇబ్బంది పెట్టే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని వాదిస్తోంది. ఈ క్ర‌మంలో విద్యుత్ లేక‌పోయినా.. జ‌నం ఇళ్ల‌ల్లో వెలుగు నింపేలా తాము కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేసేందుకు సిద్ధ‌ప‌డిన‌ట్లు ఆ పార్టీ తెలిపింది.


More Telugu News