జగన్, విజయసాయి ఇద్దరూ కేసులు కొట్టేయించుకోవాలి: రఘురామకృష్ణరాజు
- వైయస్సార్ తల్లీబిడ్ద కార్యక్రమం గతంలో కూడా ఉంది
- గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా జగన్ మాట్లాడారు
- రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమన్న రఘురాజు
వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్స్ ప్రెస్ పథకాన్ని ఈరోజు సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. డెలివరీ అయిన తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకం గతంలో కూడా ఉండేదని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో ఉన్నదానికి పేరు మార్చి వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారని చెప్పారు.
ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి వాలంటీర్లకు సన్మానం అవసరమా? అని ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలని విన్నవిస్తున్నానని అన్నారు.