బాదుడే బాదుడు.. విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన నిరసనల హోరు
- రాష్ట్రవ్యాప్తంగా జనసేన నిరసనలు
- రాజమహేంద్రవరం నిరసనలో నాదెండ్ల
- చార్జీలు తగ్గించేదాకా నిరసనలేనని ప్రకటన
ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించింది. ఈ నిరసనల్లో భాగంగా పెంచిన విద్యుత్ చార్జీలను 'బాదుడే బాదుడు' అంటూ జనసేన శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశాయి.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమహేంద్రవరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన నిరసనల్లో పాలుపంచుకున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించేదాకా తమ నిరసనలను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పిన నాదెండ్ల.. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో పోరాటం సాగిస్తామని ఆయన పేర్కొన్నారు.