ఆ పని చేయలేకపోతే కేసీఆర్ తప్పుకోవాలి: ఈటల రాజేందర్

  • పెంచిన విద్యుత్, బస్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారు
  • రైతుల నుంచి ప్రతి గింజను కొనాలి
  • మిగులు విద్యుదుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో కరెంట్ బిల్లులను పెంచడం ఏమిటన్న ఈటల  
పెంచిన విద్యుత్, బస్ ఛార్జీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటను కొంటుందనే ఆశలో ఉన్న రైతులు కోతకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ధాన్యం కొనలేకపోతే కేసీఆర్ అధికారం నుంచి తప్పుకోవాలని అన్నారు. 

17 వేల యూనిట్ల మిగులు విద్యుదుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో కరెంట్ బిల్లులను పెంచడం ఏమిటని ఎద్దేవా చేశారు. కోటి మందికి రైతుబంధు ఇస్తే 35 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావడం విడ్డూరంగా ఉందని ఈటల అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న పేషెంట్ ను ఎలుకలు కొరికిన ఘటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ను శిక్షిస్తే ఎలాగని ప్రశ్నించారు. నిధులు కేటాయించకపోతే ఆసుపత్రులు ఎలా మెరుగవుతాయని అడిగారు.


More Telugu News