కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య
- కడపలో రైలు కింద పడి ఆత్మహత్య
- పోస్టు మార్టం నిమిత్తం మృతదేహం రిమ్స్‌కు తరలింపు
- విజిలెన్స్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్
ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. విజిలెన్స్ అధికారుల వేధింపులు తాళలేక కడప నగరానికి చెందిన నూనె మిల్లు యజమాని రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే,. కడప నగరంలో నివాసం ఉంటూ నూనె మిల్లును నడుపుకుంటున్న రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం నగరానికి కొంత దూరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు విజిలెన్స్ అధికారుల వేధింపులే కారణమని రామకృష్ణారెడ్డి ఓ సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలుస్తోంది.