ఏపీలో ఒంటిపూట బడులు.. ఎప్పటి నుంచి అంటే..!

  • ఏపీలో భారీగా పెరుగుతున్న ఎండలు
  • ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు
  • ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలలు  
రోజురోజుకు ఎండలు భారీగా పెరుగుతున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలతో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను టచ్ చేస్తున్న తరుణంలో స్కూళ్లలో ఉండటం చిన్నారులకు నరకయాతనే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 

వేసవి తీవ్రత దృష్ట్యా తాము విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సురేశ్ చెప్పారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.


More Telugu News