బస్సులో రూ.2 కోట్లు తరలింపు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- వీరవల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు
- బస్సు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడడం కలకలం రేపింది. ఆ జిల్లాలోని నల్లజర్ల మండలంలోని జాతీయ రహదారిపై ఉండే వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ఈ రోజు ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తోన్న సమయంలో ఓ ప్రైవేటు బస్సులో డబ్బు గుర్తించారు. ఆ బస్సు విజయనగరం నుంచి గుంటూరుకు వెళుతున్నట్లు చెప్పారు.
పద్మావతి ట్రావెల్స్ కు చెందిన ఆ బస్సులో పాసింజర్ సీట్ల కింద లగేజ్ కేరియర్‌లో దాదాపు 2 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా నగదు తరలిస్తుండడంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బస్సు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అన్న విషయాలపై ఆరా తీసి, ఈ రోజు సాయంత్రంలోపు పోలీసులు మీడియాకు వివరాలు తెలిపే అవకాశం ఉంది.