'కేసీఆర్ కిట్టీ'లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు: రేవంత్ రెడ్డి
- పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి
- కేసీఆర్ కిట్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపాలి
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించాలి
- పేదల పట్ల మానవత్వం ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి ట్వీట్
వరంగల్ ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. నిన్న ఐసీయూలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతులను ఎలుకలు కొరికేయడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.
ఆసుపత్రిలో ఎలుకలు తిరుగుతున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు.
'ఆరోగ్య మంత్రి హరీశ్ గారూ.. “కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. “కేసీఆర్ కిట్” అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి. పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.