'వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్'లను ప్రారంభించిన జగన్

  • ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చే కార్యక్రమం
  • 500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జగన్
  • మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న సీఎం
ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చేందుకు 'వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి జగన్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవని, ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా ఉండేవి కాదని... వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మార్చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, కొడాలి నాని తదితరులు హాజరయ్యారు.


More Telugu News