ఇండియాలో 14 వేల దిగువకు కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 1,335 మందికి కరోనా పాజిటివ్
- దేశ వ్యాప్తంగా 28 మంది మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 13,672
మన దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటలలో దాదాపు 6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 1,335 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1,918 మంది కోలుకోగా... 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 14 వేల దిగువకు దిగొచ్చి... 13,672 వద్ద ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.76 శాతానికి పెరిగింది.
ఇప్పటి వరకు దాదాపు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా... 5,21,181 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 184 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్క రోజు 23.5 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.