'ఆది పురుష్' నా కెరియర్లోనే ప్రత్యేకం: ప్రభాస్

  • నిరాశపరిచిన 'రాధే శ్యామ్'
  • నిర్మాణానంతర పనుల్లో 'ఆది పురుష్' 
  • 'శ్రీరామనవమి'కి అప్ డేట్ వదిలే ఛాన్స్
  • సైన్స్ ఫిక్షన్ జోనర్లో 'ప్రాజెక్ట్  K'     
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధే శ్యామ్' ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'ఆది పురుష్' సినిమాను పూర్తిచేశాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. 

ఈ కాలంలో పురాణ సంబంధమైన పాత్రలను పోషించే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటి ఒక అవకాశం ప్రభాస్ కి రావడం నిజంగా విశేషమే. అందువల్లనే ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాననీ, శ్రీరాముడి పాత్ర తనని చాలా ప్రభావితం చేసిందని ప్రభాస్ చెప్పడం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

'శ్రీరామనవమి' సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ రావొచ్చని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటించగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. 'బాహుబలి'తో జానపదాన్నీ .. 'ఆది పురుష్'తో పౌరాణికాన్ని టచ్ చేసిన ప్రభాస్, 'ప్రాజెక్ట్  K'తో సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేశాడు. ఈ మూడు జోనర్లలో చేసే ఛాన్స్ రావడం నిజంగా విశేషమే.


More Telugu News