'ఆర్ ఆర్ ఆర్' ఓకే .. ఇక 'ఆచార్య'వంతు!

  • 'ఆచార్య'గా చిరంజీవి 
  • కొరటాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 
  • మణిశర్మ కట్టిన బాణీలు 
  • ఏప్రిల్ 29వ తేదీన విడుదల  
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశవిదేశాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మెగా ఫ్యామిలీ వైపు నుంచి చూసుకుంటే, చరణ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి 'ఆచార్య'పైనే ఉంది.          

తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' తరువాత వస్తున్న భారీ చిత్రం 'ఆచార్య'నే. బడ్జెట్ పరంగా కాకపోయినా మెగాస్టార్ క్రేజ్ వలన సహజంగానే ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఇక చరణ్ ఇమేజ్ ఎలాగూ కలిసొస్తుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలాన్ని అందించనుంది.

 'ఉగాది' కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ ట్రైలర్ వదిలే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలాగే 'శ్రీరామనవమి'కి ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆ రోజు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచనున్నారని అంటున్నారు. కథానాయికలుగా కాజల్ .. పూజ హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.


More Telugu News