ఐపీఎల్‌లో డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డు!
- ఐపీఎల్‌లో 171 వికెట్లు పడగొట్టిన బ్రావో
- రెండో స్థానానికి దిగజారిన మలింగ
- 153 మ్యాచుల్లో ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరున ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలుగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా వికెట్‌ను పడగొట్టిన బ్రావో ఈ ఘనత సాధించాడు. ఈ వికెట్‌తో అతడి ఖాతాలో మొత్తం 171 వికెట్లు చేరాయి.
ఇప్పటి వరకు 170 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మలింగ ఇప్పుడు రెండో స్థానానికి దిగజారాడు. మలింగ 122 మ్యాచుల్లో 170 వికెట్లు సాధించగా, బ్రావో ఇందుకు 153 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. వీరి తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా (154 మ్యాచుల్లో 166 వికెట్లు), పీయూష్ చావ్లా (165 మ్యాచుల్లో 157 వికెట్లు), హర్భజన్ సింగ్ (160 మ్యాచుల్లో 150 వికెట్లు) ఉన్నారు.