భద్రాచలం ఆలయంలో ప్రసాదం, ఇతర టికెట్ ధరల పెంపు
- నిత్యకల్యాణం, అభిషేకం టికెట్ ధరలు రూ. 1,500కు పెంపు
- 500 గ్రాముల నుంచి 400 గ్రాములకు తగ్గిన మహాలడ్డు బరువు
- కేశఖండన టికెట్ రూ.20కి పెంపు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రసాదం, అభిషేకం, అర్చన, కేశఖండన టికెట్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం 15 రూపాయలుగా ఉన్న కేశఖండన టికెట్ ధరను రూ. 20కి పెంచారు. నిత్యకల్యాణం టికెట్ ధరను రూ.1,500, అర్చన టికెట్ ధరను రూ. 300, అభిషేకం టికెట్ ధరను రూ.1500కు పెంచారు.
100 గ్రాముల చిన్న లడ్డు ధరను రూ.20 నుంచి రూ.25కు, పులిహోర ధరను రూ. 10 నుంచి రూ.15కు, చక్కెరపొంగలి ధరను రూ. 10 నుంచి రూ.15కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 100 రూపాయల మహాలడ్డు బరువును అరకేజీ నుంచి 400 గ్రాములకు తగ్గిస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.