ఆసుపత్రిలో ఎలుకల ఎఫెక్ట్... ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్యులపై వేటు
- ఎంజీఎం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్
- సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
- ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్
- తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల సంచారం, ఐసీయూలోని రోగి కాలును ఎలుకలు కొరికేసిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును గుర్తించిన ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో చంద్రశేఖర్‌కు కొత్త సూపరింటెండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనపై మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. మంత్రి ప్రకటనకు అనుగుణంగానే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేయడంతో పాటుగా ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది.