జైలుకు బ‌దులు సేవ‌.. 8 మంది ఐఏఎస్‌ల‌కు 8 జిల్లాల కేటాయింపు

  • కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో హైకోర్టు కీల‌క ఆదేశాలు
  • జైలు శిక్ష‌ను సేవా కార్య‌క్ర‌మాల‌గా మార్పు
  • ప్ర‌భుత్వ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో సేవ‌ల‌కు ఆదేశం
  • ఏడాది పాటు నెల‌లో ఒక రోజు హాస్ట‌ళ్ల‌లో సేవ‌
కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో జైలు శిక్ష‌కు గురైన 8 మంది ఏపీ ఐఏఎస్‌లు బేష‌ర‌తుగా అక్క‌డిక‌క్క‌డే క్ష‌మాప‌ణ కోర‌డంతో వారి ప‌ట్ల ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త క‌నిక‌ర‌మే చూపింది. జైలు శిక్ష‌ను ర‌ద్దు చేస్తూ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. 

ఏడాది పాటు నెల‌లో ఒక‌రోజు ప్ర‌భుత్వ సంక్షేమ హాస్ట‌ళ్ల‌కు వెళ్లి అక్క‌డ సేవ చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు 8 మంది ఐఏఎస్‌లు ఏఏ జిల్లాల హాస్ట‌ళ్ల‌లో సేవ చేయాల‌న్న విష‌యాన్ని కూడా హైకోర్టే నిర్దేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. 8 మంది ఐఏఎస్‌ల‌కు 8 జిల్లాల కేటాయింపు జ‌రిగిపోయింది. ఆ వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి. 

గోపాల‌కృష్ణ ద్వివేది...  కృష్ణా జిల్లా
గిరిజా శంక‌ర్‌...  ప్ర‌కాశం జిల్లా
బుడితి రాజ‌శేఖ‌ర్‌...  శ్రీకాకుళం జిల్లా
చిన‌వీర‌భ‌ద్రుడు...  విజ‌య‌న‌గ‌రం జిల్లా
జె. శ్యామ‌ల‌రావు...  అనంత‌పురం జిల్లా
వై. శ్రీల‌క్ష్మీ...  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా
విజ‌య్ కుమార్‌...  క‌ర్నూలు జిల్లా
ఎంఎం నాయ‌క్‌...  నెల్లూరు జిల్లా


More Telugu News