లాక్ డౌన్ తో మూతపడిన షాంఘైలో రోబోతో ప్రచారం... వీడియో ఇదిగో!

  • చైనాలో కరోనా కేసుల వెల్లువ
  • నగరాల్లో లాక్ డౌన్
  • షాంఘైలోనూ అదే పరిస్థితి
  • రోబోలతో ఆరోగ్య ప్రచారం
చైనాలో కొన్నివారాలుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దాంతో దేశంలోని అనేక నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. షాంఘై మహానగరంలోనూ కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో కొన్నిరోజుల కిందట లాక్ డౌన్ విధించారు. 

ఈ నేపథ్యంలో, షాంఘై వీధుల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దంటూ ఒక రోబో హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు సాగింది. చైనా భాషలో ఉన్న ఆ ఆరోగ్య ప్రకటనలు రోబో వీపుపై ఉన్న స్పీకర్ లోంచి వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News