కరోనాతో సివిల్స్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలన్న సుప్రీంకోర్టు
- కరోనాతో మెయిన్స్ రాయలేకపోయిన ముగ్గురు అభ్యర్థులు
- మరో అవకాశం కల్పించలేమన్న యూపీఎస్సీ
- వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
కరోనా సోకిన కారణంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఈ వ్యవహారంపై గురువారం నాడు విచారణ చేపట్టిన కోర్టు.. కరోనా కారణంగా పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ముగ్గురు అభ్యర్థులు కరోనా సోకిన కారణంగా మెయిన్స్ పరీక్ష రాయలేకపోయారు. తమకు మెయిన్స్ రాసేందుకు మరో అవకాశం కల్పించేలా యూపీఎస్సీని ఆదేశించాలంటూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ఇలా మరో అవకాశాన్ని కల్పించాలని ముగ్గురు అభ్యర్థులు చేసుకున్న వినతిని ఇప్పటికే యూపీఎస్సీ నిరాకరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించగా..పార్లమెంటరీ కమిటీని సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.