ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ కు శస్త్రచికిత్స పూర్తి... మత్తులోనూ ఐపీఎల్ ప్రస్తావన

  • ఇటీవల ఐపీఎల్ వేలం
  • వుడ్ ను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
  • వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా గాయపడిన వుడ్
  • తాజాగా శస్త్రచికిత్స విజయవంతం 
ఇంగ్లండ్ జట్టులోనే కాదు, ప్రపంచంలో ఇప్పుడున్న ఫాస్ట్ బౌలర్లలో మార్క్ వుడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. మార్క్ వుడ్ సిసలైన ఫాస్ట్ బౌలర్ అని చెప్పాలి. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే వుడ్ గత కొంతకాలంగా ఇంగ్లండ్ విజయాల్లో కీలకంగా మారాడు. ఇటీవల మోచేతి నొప్పితో బాధపడుతున్న వుడ్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా వుడ్ గాయానికి గురయ్యాడు. 

ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ వుడ్ ను వేలంలో రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా వుడ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సర్జరీ సమయంలో ఇచ్చిన మత్తు (అనస్థీషియా) ఐపీఎల్ పై అతడి ఉత్సాహాన్ని ఆపలేకపోయింది. 

సర్జరీ పూర్తయ్యాక సగం స్పృహలో ఉన్న మార్క్ వుడ్... తన భుజాలు నొప్పిగా ఉన్నాయని, అయినా వేగంగా బౌలింగ్ చేయగలనని చెప్పాడు. అంతేకాదు, లక్నో జట్టు ప్రధాన కోచ్ ఆండ్లీ ఫ్లవర్ అంటే తనకు ఎంతో అభిమానం అని, ఫ్లవర్ చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోని ఇంగ్లండ్ జట్టు అభిమాన సంఘం బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో పంచుకుంది.


More Telugu News